షర్మిలకు ప్రియాంక గాంధీ ఫోన్ ? పొత్తులు కుదురుతున్నాయా ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ( Karnataka Assembly Elections )ఫలితాలు కాంగ్రెస్ లో మంచి జోష్ ను నింపాయి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు ఏర్పడుతున్నాయి.

 Priyanka Gandhi's Phone To Sharmila Are There Alliances, Ys Sharmila, Sharmia, T-TeluguStop.com

కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నామనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.కాంగ్రెస్ హై కమాండ్ పెద్దల్లోనూ గెలుపు పై అదే ధీమా కనిపిస్తోంది.

ఒక్కో రాష్ట్రంలో పాగా వేయడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది.దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

దీనిలో భాగంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల ( YS Sharmila )స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీతోను పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమవుతోంది.

Telugu Aicc, Congressbrs, Karnataka, Rahul, Reddy, Sharmia, Ys Sharmila-Politics

ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.దీనికి  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు.ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్( DK Sivakumar ) మధ్యవర్తత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.డీకే శివకుమార్ త్ షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో,  ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ .ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతోనే షర్మిల తో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట.

Telugu Aicc, Congressbrs, Karnataka, Rahul, Reddy, Sharmia, Ys Sharmila-Politics

షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా , కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని,  తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతుండడంతో, అక్కడ ప్రభావం చూపిస్తే ఆ తర్వాత షర్మిల ద్వారానే ఏపీలోనూ కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉండే విధంగా చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.అయితే ఈ విషయంలో షర్మిల ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఆమె నిర్ణయంపై ఇప్పుడు అంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube