అప్పుడే 'దళపతి 68' టార్గెట్ ఫిక్స్.. బాగా ఫాస్ట్ గా ఉన్నారే!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay ) ఒకరు.ఈయన ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు.

 Thalapathy Vijay Next In Venkat Prabhu Direction, Thalapathy Vijay, Venkat Prabh-TeluguStop.com

అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.ఈయన సెట్స్ మీద ఉన్న సినిమా కంటే నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అనే విషయంలో కోలీవుడ్ జనాలు ఉత్సాహం చూపిస్తారు.

ఇప్పటికే ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో” ( Leo ) సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూట్ వారిసు రిలీజ్ కాగానే స్టార్ట్ చేయగా ఇప్పటికే 80 శాతానికి పైగానే పూర్తి చేసారు.ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Telugu Thalapathyvijay, Venkat Prabhu-Movie

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ జోడీపై అందరిలో ఆసక్తి నెలకొంది.లోకేష్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేయడంతో ఇది పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ ( Thalapathy 68 ) సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా సాలిడ్ బజ్ నెలకొంది.

Telugu Thalapathyvijay, Venkat Prabhu-Movie

ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక బజ్ వైరల్ అవుతుంది.ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే రిలీజ్ ఎప్పుడు చేయాలో కూడా ఫిక్స్ అయినట్టు టాక్.ఆగస్టు స్టార్ట్ చేయనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ( Summer 2024 ) కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ అప్పుడే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది.కాగా త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube