టాలీవుడ్ ఇండస్ట్రీలో చైతన్య, సమంతలకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చైతన్య, సమంత కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
అయితే కేవలం నెల రోజుల గ్యాప్ లో సమంత( Samantha ) నటించిన శాకుంతలం( Shaakuntalam ), చైతన్య నటించిన కస్టడీ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
అయితే ఈ రెండు సినిమాల కంటే బిచ్చగాడు2 సినిమా ఫస్ట్ డే బెటర్ కలెక్షన్లను సాధించింది.సెకండ్ డే కూడా బిచ్చగాడు2 బెటర్ కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది.
తెలుగులో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న చైసామ్ కంటే విజయ్ ఆంటోని( Vijay Antony ) సినిమా భారీగా కలెక్షన్లను సాధించడం అంటే వాళ్లకు అవమానమే అని చెప్పాలి.

చైసామ్ లకు ఇంతకు మించి అవమానం ఉంటుందా అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. చైసామ్ సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకుంటుండగా కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్లే వాళ్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.అక్కినేని హీరోలకు ఈ ఏడాది కూడా కలిసిరాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్కినేని హీరోలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అక్కినేని హీరోలకు భవిష్యత్తు సినిమాలు అయినా కోరుకున్న విజయాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.
మరోవైపు చైతన్య సమంత విడిపోయినా ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అటు సమంత కానీ ఇటు నాగచైతన్య కానీ రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
భవిష్యత్తులో సైతం వీళ్లిద్దరూ రెండో పెళ్లికి దూరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.







