బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman khan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సల్మాన్ ఖాన్ బాలీవుడ్( Bollywood ) ప్రేక్షకులతో పాటుగా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పారుచుకున్నాడు.ఇది ఇలా ఉంటే ఇటీవల సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ కి సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ముంబైలోని ఒక ప్రైమ్ లొకేషన్ లో 19 అంతస్థులు హోటల్ ని నిర్మించబోతున్నాడట సాల్మన్ ఖాన్.సముద్రం ఫేసింగ్ వచ్చేలా ఉండే ఆ బిల్డింగ్ ని BMC లో తన తల్లి పేరు సుశీల చారక్ ( Sushila Charak )పై రిజిస్టర్ చేయించాడట సల్మాన్.ఫస్ట్ రెండు ఫ్లోర్స్ లో కేఫ్, మూడో ఫ్లోర్ లో జిమ్ అండ్ స్విమింగ్ పూల్.4వ అంతస్థు సర్వీస్ కి, 5 అండ్ 6 ఫ్లోర్స్ కన్వెన్షన్ సెంటర్ కి, మిగతా ఫ్లోర్స్ అన్ని హోటల్ సర్వీస్ కి ఉపయోగించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలో జోరుగా వస్తున్నాయి.కాగా సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3( Tiger 3 ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు సల్లు భాయ్.కాగా సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయసు దాటి ఆరోపదుల వయసుకి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నారు సల్మాన్ ఖాన్.అంతే కాకుండా ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు సల్మాన్ ఖాన్.