తారక్( Tharak )ఫ్యాన్స్ కు ఆయన పుట్టిన రోజు( Birthday ) నాడు సర్ప్రైజ్ రెడీ అయ్యింది.ఇప్పటికే ఈయన నటిస్తున్న సినిమా నుండి టైటిల్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
ఈ మాస్ ఫీస్ట్ తెగ నచ్చేసింది.ఇక ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈయన బర్త్ డే సెలెబ్రేషన్స్ మోత మోగిపోతుంది.ఇదిలా ఉండగా ఈ రోజు తన సెన్సేషనల్ హిట్ సింహాద్రి రీ రిలీజ్( Simhadri re-release ) తో మరో పండుగ కానుంది ఫ్యాన్స్ కు.తాజాగా ఈ రీ రిలీజ్ కు సంబంధించిన బిగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఇండియా సహా వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ రీ రిలీజ్ గా ఈ సినిమా నిలిచినట్టు తెలుస్తుంది.
ఈ రీ రిలీజ్ ను ఇటీవలే వచ్చిన చిత్రాలన్నిటిలో అత్యధికకంగా 1210 షోలు పడిన సినిమాగా సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా రీ రిలీజ్ కు అప్పాయుడే థియేటర్స్ లో విజిల్స్ తో మోత మోగిస్తున్నారు.చూడాలి రీ రిలీజ్ తో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో.ఇక ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయగా భూమిక హీరోయిన్ గా నటించింది.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.అలాగే ఈమె ఈమె కీరవాణి సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ”NTR30” సినిమా చేస్తున్నారు.
పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”దేవర”( DEVARA movie ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అవ్వగా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఓకే అయ్యాడు.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది.