ప్రస్తుతం చాట్ జీపీటీ( ChatGPT ) హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.ఓపెన్ ఏఐ( Open AI ) క్రియేట్ చేసిన చాట్ జీపీటీ ఇక యాప్ రూపంలో వినియోగదారులకు మరింత చేరువ అవనుంది.
ప్రస్తుతం ఐఫోన్(iPhone) వినియోగదారులు ఈ చాట్ జీపీటీ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.త్వరలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ చాట్ జీపీటీ యాప్ అందుబాటులోకి రానుంది.
అమెరికాలో ఐఫోన్ ఉపయోగిస్తున్న వినియోగదారులు ముందుగా ఈ యాప్ ను యాక్సెస్ చేసుకొని ఉపయోగించుకుంటారు.ఆ తరువాత ఇతర దేశాల ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి ఈ యాప్ రానుందని కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా ఐఓఎస్ కోసం చాట్ జీపీటీ వాయిస్ ఇన్ పుట్స్ ను అనుమతిస్తుంది.ప్లస్ మెంబర్షిప్ కలిగి ఉన్న వినియోగదారులు ఈ యాప్ ద్వారా మెరుగైన, వేగవంతమైన సేవలు పొందవచ్చు.ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ లోనుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే యాప్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంపెనీ ముందుగా అమెరికాలో మాత్రమే ఈ యాప్ ను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక కారణం ఏమిటంటే.
అమెరికాలో చాట్ జీపీటీ యాప్ అందుబాటులోకి తెచ్చాక, వినియోగదారులు ఈ యాప్ ను ఉపయోగించడం మొదలు పెట్టాక ఏవైనా టెక్నికల్ సమస్యలు వచ్చినా లేదంటే వినియోగదారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ యాప్ లో ఫీచర్లు, భద్రత వంటి వాటిని మెరుగు పరుస్తామని కంపెనీ తెలిపింది.ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఈ యాప్ లో సలహాలు, ఇన్ స్టంట్ సమాధానాలు, క్రియేటివ్ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగత బోధన, వృత్తి గత సమాచారం లాంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.