ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన నాలుగో ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
మద్యం కుంభకోణంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్రపై కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది.ఈడీ నాలుగో ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు మే 30వ తేదీన తీర్పును వెలువరించనుంది.