అప్పు( Debt ) ఇచ్చి తిరిగి చెల్లించమని అడగడంతో.అప్పు తీరుస్తామని పిలిచి ఓ వివాహేతపై కారు ఎక్కించి, బండరాళ్లు మోది దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో( Prakasham District ) తీవ్ర కలకలం రేపింది.
పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన మేడం సుధాకర్ రెడ్డి, సుబ్బలక్ష్మమ్మ దంపతుల కుమార్తె రాధ(35)కు,( Radha ) తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్ రెడ్డికు కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
మోహన్ రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉండగా.ఇతని భార్య రాధ కోదాడలో ఉండేది.అయితే మోహన్ రెడ్డి, రాధ దంపతులు ఒక వ్యక్తికి రూ.50 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు.

రాధ ఈనెల 11న చౌడేశ్వరి దేవి పూజల నిమిత్తం పుట్టింటికి వెళ్ళింది.తరువాత ఆమెకు ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చి, తాను బెంగుళూరు నుండి మాట్లాడుతున్నానని కనిగిరి వద్దకు వస్తే మీరు ఇచ్చిన అప్పు చెల్లిస్తానని చెప్పాడు.అతని మాటలు నమ్మిన రాధ.తన చిన్న కుమారుడిని తీసుకుని కనిగిరిలో ఉండే బాబాయి ఇంటికి బుధవారం సాయంత్రం వెళ్ళింది.తర్వాత మళ్లీ ఆ వ్యక్తి రాధకు ఫోన్ చేసి పామూరు బస్టాండు వద్దకు రావాలని చెప్పడంతో, కుమారుడిని ఇంటి వద్దనే ఉంచి ఆమె ఒంటరిగా పామూరు బస్టాండుకు వెళ్ళింది.బయటకు వెళ్లిన రాధ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే మరి కాసేపట్లో ఇంటికి వస్తానని చెప్పింది.

రాత్రి 8 దాటిన రాధ ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాధ తండ్రి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు రాధ మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు సమీపంలో ఉన్నట్లు గుర్తించగా, అక్కడికి వెళ్ళి చూసే లోపు రాధ చనిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు మృతుదేహాన్ని పరిశీలించి, ఆమెను రోడ్డుపై ఈడుచుకెళ్ళి, కాళ్లపై నుంచి కారును పోనించి, తరువాత గుండెల పైనుంచి కారు పోనిచ్చి, ముఖంపై బండరాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు.తన అల్లుడు, కూతురు వెలిగండ్ల మండలంలో ఉండే ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి రూ.50 లక్షలు అప్పు ఇచ్చారని, ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.








