జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం.ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు.

 Cabinet Approval For Allotment Of Housing Plots For Journalists , Telangana Cabi-TeluguStop.com

అతి త్వరలో పంపిణీ చేస్తామన్న మంత్రి పువ్వాడ.ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.

5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ ని స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఆమోదం తెలిపారు.ఇప్పటికే స్థలం గుర్తించామని, మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube