కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ప్రజల భద్రతను కేంద్రం గాలికి వదిలేసిందని ఆరోపించారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.కర్ణాటకలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ది చెప్పారన్నారు.
కర్ణాటకలో ఎలాగైనా గెలవాలని మంత్రులు మోహరించారు.కానీ ప్రజలు మంచికే పట్టం కట్టారని తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం పెద్ద గెలుపుకాదని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.







