ఈ మద్య ఏపీలో నెల్లూరు పాలిటిక్స్( Nellore Politics ) ఎంతటి హాట్ టాపిక్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా అధికార వైసీపీకి( YCP ) నెల్లూరులో జరుగుతున్నా రాజకీయ పరిణామాలు ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
ఆ మద్య వెంకటగిరి నియోజిక వర్గ ఎమ్మెల్యే ఆనం రామనాయరణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారి వ్యవహారం వైసీపీని ఏ స్థాయిలో దెబ్బతీశాయో అందరికీ తెలిసిందే.దాంతో వేరే ఆప్షన్ లేక వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి.
ఇక తాజాగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) మరియు ఆయన బాబాయ్ రూప్ కుమార్ తో మద్య చెలరేగిన విభేదాలు వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారాయి.

ఇద్దరు బండువులే అయినప్పటికి పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతలా ఈ ఇద్దరి మద్య విభేదాలు కనసాగుతూ వస్తున్నాయి.దీంతో స్వయంగా జగనే రంగంలోకి దిగి ఇద్దరి మద్య గొడవను సద్దుమనిగించే ప్రయత్నం చేశారు.అయితే రాజకీయాల నుంచైనా తప్పుకుంటాను గాని రూప్ కుమార్ తో కలిసిన పని చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు అనిల్ కుమార్ యాదవ్.
ప్రస్తుతం రూప్ కుమార్ నెల్లూరు డిప్యూటీ మేయర్ గా పని చేస్తున్నారు.దీంతో అటు అనిల్ ఇటు రూప్ కుమార్ ఇద్దరు కూడా వైసీపీకి నెల్లూరు తరుపున కీలక నేతలే.
దీంతో ఈ ఇద్దరి మద్య ఎలా సక్యత పెంచాలనే దానిపై వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోందట.

మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కీలక నేతల మద్య ఈ విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.ఇదిలా ఉంచితే ఈ విభేదాల కారణంగా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ వీడే అవకాశం ఉందనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఆ వార్తలపై తాజాగా స్పందించిన అనిల్ కుమార్.
వైసీపీని వీడే ప్రసక్తే లేదని, ఒకవేళ వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.దీంతో రూప్ కుమార్, అనిల్ కుమార్ మద్య చెలరేగిన వివాదం రూపుమాపేందుకు స్వయంగా జగన్ రంగంలోకి దిగిన ఫలితం లేకపోయింది.
మొత్తానికి నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.మరి వచ్చే ఎన్నికల్లో ఈ వివాదాలు నెల్లూరు రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి.







