నాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్( Nivetha Thomas ) నానితో జెంటిల్మన్ హిట్ కొట్టి అదే నానితో మరోసారి నిన్ను కోరి సినిమా( Ninnu Kori ) చేసింది.ఇక ఎన్.
టి.ఆర్ లాంటి స్టార్ హీరో సరసన కూడా నటించింది అమ్మడు.సరైన కథల ఎంపిక లేకపోవడం వల్లో లేక మరే కారణమో తెలియదు కానీ తెలుగులో చిన్నగా గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది నివేదా థామస్.పవన్ వకీల్ సాబ్ లో కనిపించిన నివేద శాకిని డాకిని( Saakini Daakini ) అంటూ ఒక అటెంప్ట్ చేసింది.
ఆ సినిమాలో రెజినాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అమ్మడు.

సినిమాల కన్నా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ లో ఎక్కువ ఆడియన్స్ తో టచ్ లో ఉంటుంది నివేదా.ఆమధ్య బాగా బొద్దుగా మారిన అమ్మడు మళ్లీ తన లుక్స్ విషయంలో దృష్టి పెట్టిందని తెలుస్తుంది.అయితే టాలీవుడ్ మాత్రం అమ్మడిని దాదాపు లైట్ తీసుకుందని తెలుస్తుంది.
ఆల్రెడీ రోజుకొక కొత్త హీరోయిన్ వస్తున్న ఈ టైం లో నివేదా ని పిలిచి ఛాన్స్ ఇచ్చే వీలు లేదని తెలుస్తుంది.నివేదా మాత్రం ఒక్క ఛాన్స్ వస్తే మాత్రం తన టాలెంట్ చూపిస్తానని అంటుంది.
మరి అమ్మడికి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.







