దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా విడుదలయ్యి దాదాపు సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఇంకా ఏ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అలాగే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ( Naatu Naatu Song ) గాను ఆస్కార్ అవార్డు ( Oscar Award) కూడా అందుకున్నారు.
ఇలా ఎన్నో అద్భుతమైన సంచలనాలను సృష్టించిన ఈ సినిమా వివిధ దేశాలలో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమాలో నటించిన టాలీవుడ్ యంగ్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు కూడా లభించింది.ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ఈ ఇద్దరు హీరోలకు మరో అరుదైన గౌరవం అందుకున్నారు.ఇక జపాన్( Japan ) లో కూడా ఈ సినిమా విడుదల ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
అయితే తాజాగా జపాన్ లో ఈ ఇద్దరు హీరోలు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
జపాన్ లో అత్యంత పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్, ఎన్టీఆర్ ఫోటోలని ప్రచురించారు.ఇలా జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోల ఫోటోలను ప్రచురించడంతో ఇది వారికి దక్కిన గౌరవం అని భావించాలి ఇలా ఇద్దరి హీరోల ఫోటోలు మ్యాగజైన్ కవర్ పేజీపై రావడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వారి తదుపరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.