సినిమా ఇండస్ట్రీ పోటీ అనేది సర్వసాధారణం.అయితే వీలైనంత ఎక్కువ సినిమాల్లో నటించడానికి పోటీ పడటం లేదా ఒకరిని మించి మరొకరు హిట్స్ కొట్టడానికి పోటీ పడటం వరకు బాగానే ఉంటుంది.
కానీ పరాజయాల్లో పోటీ పడటం ఎప్పుడైనా చూసారా ? ప్రస్తుతం ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ పరిస్థితి అలాగే ఉంది.వరస పరాజయాలను ఎదుర్కొంటు ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎక్కువ డిజాస్టర్స్ సాధించారో చూద్దాం ? ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు పూజ హెగ్డే మరియు కృతి శెట్టి.
కృతి శెట్టి

కృతి శెట్టి నటించిన మొదటి సినిమా ఉప్పెన తో పాటు వరస గా మూడు సినిమాలు విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ సాధించి లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.అయితే ఎవరి దిష్టి తగిలిందో కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలవుతున్నాయి.మరి ముఖ్యం గా ఆమె నటించిన గత నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్స్ కావడం విశేషం.వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గంలో, కస్టడీ వంటి నాలుగు పెద్ద హీరోల సినిమాల్లో నటించిన కృతి శెట్టి కి ( Krithi Shetty )డిజాస్టర్ ఫలితాలు తప్పలేదు.
పూజ హెగ్డే

మొదట్లో దువ్వాడ జగన్నాధం, ముకుంద వంటి ప్లాప్ చిత్రాల తర్వాత మంచి విజయాలు సాధించి టాలీవుడ్ లో నే నుంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.కానీ పూజ( Pooja Hegde ) సైతం ప్రస్తుతం డౌన్ ఫాల్ చూస్తుంది.ఆమె నటిస్తున్న అన్ని సినిమాలు గోరంగా విఫలం అవుతున్నాయి.ఆచార్య, బెస్ట్, కిసీకి భాయిజాన్ కిసీకిజాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan ), సర్కస్ సినిమాలే కాకుండా రాధే శ్యామ్ వంటి అనేక చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో వరసగా నాలుగు డిజాస్టర్స్ సాధించిన రికార్డు పూజకి దక్కింది.
ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా పరాజయాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ మోస్ట్ అన్ లక్కీ హీరోయిన్స్ గా మారారు.







