బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా రాణిస్తూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా ప్రపంచసుందరిగా కిరీటాన్ని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ డేట్ లో శృంగారం గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది ప్రియాంక చోప్రా.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్( Web series ) ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేసినట్లు ఆమె తెలిపింది.కానీ ఆ బందలేవి నిలకడగా లేకపోవడంతో ఒక రిలేషన్ నుంచి మరొక రిలేషన్ కి వెంట వెంటనే మారానని తెలిపింది.ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశానని కానీ ఆ బంధాలు విషాదంగా ముగిసాయని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.
ఇక అనంతరం అమెరికన్ పాప్ సింగర్ నటుడు నిక్ జోనస్( Actor Nick Jonas ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు ఆమె తెలిపింది.ఈమె సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే.

సిటాడెల్ ( Citadel )వెబ్ సిరీస్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.శృంగార సన్నివేశాల్లో నటించే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డాను అని తెలిపింది ప్రియాంక చోప్రా.అలాగే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఫస్ట్ డేట్ లోనే మీరు శృంగారానికి అంగీకరిస్తారా అని అడగగా వెంటనే ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఫస్ట్ డేట్ లోనే శృంగారానికి ఒప్పుకుంటాను.దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది.ఫస్ట్ టైం కలయికలో అతను ఎంతటి రసికుడో భవిష్యత్ లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయంటూ తన మనసులోని భావాలను బయట పెడుతూ బోల్డ్ గా కామెంట్స్ చేసింది.








