కృష్ణగారిని అలా చూసి తట్టుకోలేకపోయాను... ఎమోషనల్ నరేష్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వయసు పై పడటంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కృష్ణ గారు నవంబర్ 15వ తేదీ 2022లో మరణించిన విషయం మనకు తెలిసిందే.

 I Couldn't Bear To See Krishnagari Like That Naresh Details, Krishna,omkar, Mall-TeluguStop.com

కృష్ణ మరణించి ఆరునెలలు అవుతున్నప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక తాజాగా నరేష్ (Naresh) కృష్ణగారి మరణం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

Telugu Krishna, Malli Pelli, Naresh, Omkar, Pavitra Lokesh, Sixthsense, Vijay Ni

నరేష్ పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తాజాగా ఓంకార్ (Omkar) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తమ ప్రేమ గురించి తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమంలో నరేష్ విజయనిర్మల(Vijay Nirmala) కృష్ణ గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవారని తెలిపారు.అయితే అమ్మ మరణించిన తర్వాత ఒక కుర్చీ కాలి అయింది.

Telugu Krishna, Malli Pelli, Naresh, Omkar, Pavitra Lokesh, Sixthsense, Vijay Ni

అమ్మ చనిపోవడంతో నేను కృష్ణగారిలోనే మా అమ్మను చూసుకున్నానని నరేష్ తెలిపారు.కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారని నరేష్ తెలిపారు.అమ్మ మరణం తర్వాత తనలోనే అమ్మను చూసుకుంటూ ఉన్న నాకు కృష్ణ గారి మరణం తీరని లోటు అని తెలిపారు.కృష్ణ గారు మరణించిన తర్వాత ఆయనని అలా చూసి తట్టుకోలేకపోయానని ఈ సందర్భంగా నరేష్ కృష్ణ గారి మరణం తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

అనంతరం అక్కడే ఉన్నటువంటి పవిత్ర నరేష్ ను ఓదార్చారు.వీరు కృష్ణ విజయనిర్మలకు గుర్తుగా నరేష్ తిరిగి విజయకృష్ణ బ్యానర్(Vijaya Krishna Banner) ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.

ఈ బ్యానర్ లోనే నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి (Malli Pelli) అనే సినిమా నిర్మించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube