వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని( Vidudala Rajini ) సంచలన ప్రకటన చేశారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వాసుపత్రిలో సేవల సమయం పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
వైద్య ఆరోగ్య రంగాపరంగా రాష్ట్ర ప్రభుత్వం విచ్చేస్తున్న నిధులు కనుగొనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు సౌకర్యాలు మెరుగుపడాలని… సీఎం జగన్ ( CM Jagan )ఆశిస్తున్నారని మంత్రి విడుదల రజని పేర్కొన్నారు.వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో గణనీయమైన మార్పులు వచ్చేలా నిరూపించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

మంగళవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.రోగి ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగుపెట్టగానే.పోందుకోబోయే సౌకర్యాల గురించి పోస్టర్లు కనబడేలా ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని సూచించారు.అదేవిధంగా సీఎం జగన్ ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం మరియు కేటాయిస్తున్న నిధులు సిబ్బంది నియామకం వంటి విషయాలు.
వాటి విషయంలో ఒక చరిత్ర సృష్టించారని.అందుకు సంబంధించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుకున్న రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి.ఆసుపత్రిలో పారిశుద్ధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి రజిని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో తనిఖీల సంఖ్య పెంచాలని….తనిఖీల సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో ఏమాత్రం అవకతవకలు జరగకుండా.చూసుకోవాలని కోరారు.







