తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో మంటల మిస్టరీ చెలరేగింది.గడిచిన 20 రోజులుగా గ్రామంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇళ్లల్లో వస్తువులు అకారణంగా దగ్ధమవుతున్నాయని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే 70 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.







