అణాపైసలతో సహా చెల్లిస్తానని అప్పట్లో ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. అంతలా హర్ట్ కావడంతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో ఒకరు.నంబర్ వన్ హీరోల రేసులో ముందువరసలో ఉన్న ఈ హీరో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పెద్దగా పట్టించుకోరు.

 Young Tiger Junior Ntr Sensational Tweet Details Here Goes Viral In Social Media-TeluguStop.com

మరీ అవసరం అయితే తప్ప ఏదైనా వివాదాస్పద విషయం గురించి స్పందించడానికి తారక్ ఇష్టపడరు.అయితే తారక్ గతంలో ఒక సందర్భంలో అణాపైసలతో సహా చెల్లిస్తానని చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఒకే ఒక్క మూవీ నాన్నకు ప్రేమతో కాగా ఈ సినిమాకు బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్( B.V.S.N.Prasad ) నిర్మాతగా వ్యవహరించారు.టెంపర్ ( Temper )తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.సంక్రాంతి కానుకగా ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం.

Telugu Bvsnprasad, Ntr, Tax, Temper, Tollywood-Movie

అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా పారితోషికానికి సంబంధించి ట్యాక్స్ చెల్లించలేదని అప్పట్లో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఈ సినిమాకు తారక్ 7.33 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.సాధారణంగా సినిమాలోని అన్ని సన్నివేశాలను వేరే దేశాలలో తీస్తే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

తనపై నెగిటివ్ కామెంట్లు రావడంతో ఆ సమయంలో తారక్ సైతం ఇవే విషయాలను వెల్లడించారు.

Telugu Bvsnprasad, Ntr, Tax, Temper, Tollywood-Movie

పొరుగుదేశంలో నిర్మించిన సినిమాకు మన దేశంలో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం వల్లే నేను ట్యాక్స్ చెల్లించలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఈ రీజన్ వల్లే నేను ప్రొడ్యూసర్ల నుంచి సర్వీస్ ట్యాక్స్( Service Tax ) వసూలు చేయలేదని ఆయన అన్నారు.తన ఆడిటర్లు కాగ్ విచారణలో లిఖితపూర్వకంగా ఈ విషయాలను వెల్లడించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాకు ఎలాంటి నోటీసులు రాలేదని తారక్ తెలిపారు.తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని నాకు నోటీసులు అందితే అణా పైసలతో సహా తిరిగి చెల్లిస్తానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ అప్పట్లో వెల్లడించిన విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా హర్ట్ అయ్యారని కామెంట్లు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube