కర్నాటకలో కాంగ్రెస్( Karnataka Congress ) కనీ వినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ పార్టీలో విన్నింగ్ జోష్ ఎంతమేర ఉందో తెలియదు గాని కన్ఫ్యూజన్ మాత్రం పుష్కలంగా ఉంది.136 స్థానాల్లో గెలిచామనే హ్యాపీనెస్ ఒకవైపు ఉంటే సిఎం ఎవరనే చర్చ మరోవైపు నడుస్తోంది.ప్రస్తుతం పార్టీలో ఇద్దరు అగ్రనేతలు సిఎం చైర్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.
నేను సిఎం అంటే నేను సిఎం అంటూ కయ్యనికి కాలు దువ్వుతున్నారు.పార్టీలో సీనియర్ నేతనని సిఎం పదవికి తానే అర్హుడనని సిద్దిరామయ్య ( Siddharamaiah ) చెబుతుంటే.
మరోవైపు పార్టీని ఎన్నికల్లో ఒంటి చేత్తో గెలిపించానని సిఎం పదవి తనకే కావాలని డీకే శివకుమార్( DK Sivakumar ) చెబుతున్నారు.

ఇలా ఈ ఇద్దరి మదే సిఎం పదవిపై నెలకొన్న పోటీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.నిన్న జరిగిన సిఎల్పీ సమావేశంలో కూడా సిఎం ఎవరనేది తేల్చలేక చేతులెత్తేశారు ఆ పార్టీ ఎమ్మేల్యేలు.దీంతో ఈ వ్యవహారం డిల్లీ కి చేరింది.
ఇప్పటికే సిద్దిరామయ్య, డీకే శివకుమార్ డిల్లీకి చేరుకున్నారు కూడా.పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో ఇరువురు భేటీ కానున్నారు.
ఈ సమావేశం తరువాత సిఎం ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఎవరికి సిఎం పదవి కట్టబెట్టిన ఒంకొకరి వైపు నుంచి అసంతృప్తి జ్వాలలు రేకెత్తే అవకాశం ఉంది.

మెజారిటీ ఎమ్మేల్యేలు తాననే సిఎం గా కోరుకుంటున్నారని సిద్దిరామయ్య చెబుతుంటే.గెలిచిన 135 ఎమ్మెల్యేలను తానే గెలిపించుకున్నానని సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గనని డీకే శివకుమార్ చెబుతున్నారు.అయితే వీరిద్దరి మద్య విబేదలు ఉన్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నప్పటికి అలాంటివేవీ లేవని ఇద్దరు నేతలు చెబుతున్నారు.ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే విభేదాలు నిజమేనేమో అనే సందేహం రాక మానదు.
మొత్తానికి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఆనందం కన్నా.ఇరువురి నేతల మద్య జరుగుతున్నా సిఎం పదవి పై నెలకొన్న పోటీ ఆ ఆనందన్నంతా ఆవిరి చేస్తోంది.
మరి అధిష్టానం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.







