టాలీవుడ్ హీరో నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ.( Custody ) ఈ సినిమాలో చైతన్య సరసన కృతి శెట్టి( Krithi Shetty ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా నేడు అనగా మే 12వ తేదీన విడుదల అయిన విషయం తెలిసిందే.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందే నుంచే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేపట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా తెలుగు తమిళం రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేశారు.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో మూవీ మేకర్స్ పై హీరో నాగచైతన్య పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే వారాంతం ముగియడంతో కస్టడీ సినిమా జాతకం తేలిపోయింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదనే విషయాన్ని ట్రేడ్ తేల్చేసింది.దీంతో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ సినిమా ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.

కాగా ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడమే మానేశారు.శనివారం రోజున కస్టడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ కూడా దాటలేదు.ఇక నిన్నటి ఆదివారం కూడా ఏపీ, నైజాంలో షేర్ కోటి రూపాయలు దాటలేదు.సోమవారం అనగా నేడు కస్టడీ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.ఆంధ్ర, నైజాం, సీడెడ్ లో ఎక్కడా ఆక్యుపెన్సీ 30,40 శాతం దాటలేదు.ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో, ఈ వీకెండ్ వరకు సినిమా నిలబడుతుందనే గ్యారెంటీ కూడా లేదు.
అంతే కాకుండా ఈ సినిమా తొందర్లోనే ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.







