Tollywood Heros: మన టాలీవుడ్ హీరోలు ఆ విషయాన్నీ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో?

ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.మన హీరోలు హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

 When The Tollywood Heroes Will Know All That Nithin Naga Chaitanya Varun Tej-TeluguStop.com

అయితే ప్రతి హీరోల సినిమాల హిట్ ఫ్లాప్ లను డీకోడ్ చేస్తే ఓ లైను లెంగ్తు తెలుస్తుంది.వాటిని కంపేర్ చేసుకుంటే సక్సెస్ కు కాస్త అయినా సూత్రం కనిపిస్తుంది.

కానీ మా టాలీవుడ్ హీరోలు మాత్రం ఆ సూత్రాన్ని పాటించడం లేదు.ఎంతసేపు ఫ్లైట్ లు రొమాంటిక్ సీన్లు ఉండాలి పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలి ఇలాంటి వాటిపై ఎక్కువగా శ్రద్ధను చూపిస్తున్నారు.

ఇక యంగ్ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా 18 ఏళ్ల అమ్మాయిలతోనే రొమాన్స్ చేస్తున్నారు.కానీ సినిమా సినిమాలకు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి.ఒక హీరో స్టైల్ మరొక హీరో ఫాలో అయితే ప్రేక్షకులు దానిని ఒప్పుకోవడం లేదు.ఇకపోతే ఒక్కొక్క హీరో విషయానికి వస్తే.

ముందుగా టాలీవుడ్ హీరో నితిన్( Nithin ) విషయానికి వస్తే.వరుసగా రెండు హిట్ సినిమాలు పడేసరికి నితిన్ మళ్ళీ మాస్ వైపు అడుగులు వేస్తున్నాడు.

ఇక నాగచైతన్య ( Naga Chaitanya ) విషయానికి వస్తే ఏం మాయ చేసావే, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Telugu Ghani Moive, Heroes, Lofer, Mister, Move, Naga Chaitanya, Nithin, Tollywo

ఆ తర్వాత వచ్చిన సవ్యసాచి సాహసం శ్వాసగా సాగిపో వెంకీ మామ లాంటి సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ గా నిలిచాయి.అయితే నాగచైతన్య నటించిన హిట్ అయిన సినిమాలు అన్ని ఒకటే జానర్, కానీ పాయింట్లు మాత్రం వేరు.వరుణ్ తేజ్( Varun Tej ) విషయానికి వస్తే.ఫిదా,తొలిప్రేమ,ఎఫ్2,ఎఫ్3 లాంటి సినిమాలతో సక్సెస్ ను అందుకున్న వరుణ్ తేజ్ లోఫర్, మిస్టర్,గని లాంటి సినిమాలతో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు.

Telugu Ghani Moive, Heroes, Lofer, Mister, Move, Naga Chaitanya, Nithin, Tollywo

వరుణ్ తేజ్ కి మాస్ సెట్ కాదని తెలిసినప్పటికీ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు.ఇలా ప్రతి ఒక్క హీరోకి సెట్ అయిన జానర్ ఉంటోంది.సెట్ కానీ సినిమాలు కూడా ఉన్నాయి.

హీరోలు సెట్ అయిన సినిమాలను పక్కనపెట్టి సెట్ కానీ సినిమాల వైపు ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు.ఈ విషయంలో మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అని అభిమానులు తలలు భాదుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube