టిఎస్ పిఎస్పీ పరీక్షకు లక్ష మించితే ఓ ఎం ఆర్ పద్ధతే

హైదరాబాద్‌, మే 15 టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

 Omr Method Is More Than One Lakh For Tspsc Exam ,tspsc Exam, Group 1 , Deputy Co-TeluguStop.com

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ( TSPSC ) నోటిఫికేషన్‌ ఇచ్చింది.అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది.

మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు.మెయిన్స్‌కు 25,050 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది.

ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ( Paper leak ) వ్యవహారం బయటపడింది.దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది.

మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది.గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీలో ప్రక్షాళనకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా తొలుత ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది.

టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించింది.వీటితోపాటు కొత్తగా డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌( Deputy Controller of Examinations ), చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌, లా ఆఫీసర్‌(జూనియర్‌ సివిల్‌ జడ్జి క్యాడర్‌) పోస్టులను మంజూరు చేసింది.

దశలవారీగా భర్తీ ప్రక్రియ జరుగుతున్నది.గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందరినీ మార్చింది.

మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది.టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ప్రతి విషయాన్ని డేగ కన్నుతో పరిశీలిస్తున్నది. జూన్‌ 11నే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళికలన్నీ సిద్ధం చేసింది.

అభ్యర్థులు అనవసరపు ప్రచారాలు నమ్మకుండా, ప్రిపరేషన్‌ కొనసాగించాలని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube