మదర్స్ డే స్పెషల్ అమ్మకు బంగారం కొనిచ్చిన యాంకర్ సుమ.. వీడియో వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా కనకాల (Suma Kanakala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

 Anchor Suma Gifted Gold To Her Mother On Mothers Day Details,suma Kanakala,rosha-TeluguStop.com

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సుమ ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా మదర్స్ డే (Mothers Day) సందర్భంగా సుమా తన తల్లికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

సుమ మే 14 మదర్స్ డే పురస్కరించుకొని తన తల్లి కోసం ఒక బంగారు గిఫ్ట్(Gold Gift) కానుకగా ఇవ్వాలని భావించి తాను హైదరాబాద్ సీఎంఆర్ లో గోల్డ్ షాపింగ్ చేసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో షో రూమ్ లో ఉన్నటువంటి వివిధ రకాల బంగారు ఆభరణాలను చూపిస్తూ వచ్చారు.

అయితే చివరికి తన తల్లికి ఒక చిన్న గోల్డ్ ఐటమ్ కొనుగోలు చేశారని చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి కానుకలతో పాటు బోలెడంత ప్రేమను కూడా మన తల్లిదండ్రులకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Anchor Suma, Gold Gift, Gold Jewelry, Mothers Day, Roshan, Suma Kanakala,

ఇలా అమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక సుమ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమా ఈవెంట్లతో నిత్యం ఎంతో బిజీగా గడిపే సుమ తనకు వీలు కుదిరినప్పుడల్లా యూట్యూబ్ ద్వారా వీడియోలను చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

Telugu Anchor Suma, Gold Gift, Gold Jewelry, Mothers Day, Roshan, Suma Kanakala,

ఇక సుమ కుమారుడు రోషన్(Roshan) సైతం హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం సుమ కుమారుడు హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.సుమ కూడా జయమ్మ పంచాయతీ(Jayamma Panchayethe) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube