‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story).ఈ సినిమా ఎన్ని వివాదాలతో రిలీజ్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమా గురించి ఇప్పుడు అందరు మాట్లాడు కుంటున్నారు.గత కొన్నాళ్లుగా కేరళ (Kerala) లో అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజం లోకి తీసుకు వెళ్తున్నారు అని బహిరంగంగానే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఇదే నేపథ్యంలో కథను ను తీసుకుని డైరెక్టర్ ( Sudipto sen )సినిమాగా తెరకెక్కించాడు.

ఈ రోజుల్లో ఏదైనా సినిమా ఎంత కాంట్రవర్షియల్ అయితే అంత ఫ్రీ పబ్లిసిటీగా మారిపోయింది.అలాగే ఈ సినిమాకు వచ్చిన వివాదాలే ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అని చెప్పాలి.కాంట్రవర్సీ కారణంగా సినిమా కలెక్షన్స్ అమాంతం పెరుగు తున్నాయి.
ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా పది రోజుల్లో 136.7 కోట్ల రుపాయల వసూళ్లను రాబట్టింది.మొదటి రోజు నుండి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్న ఈ సినిమా ఇప్పటికీ దూకుడు మీదనే ఉంది.
దీంతో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని అంచనా వేస్తున్నారు. సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.అదా శర్మ, సిద్ది ఇరాని, యోగితా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంలో సఫలం అయ్యింది.అంతేకాదు వివాదం కూడా ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఈ సినిమా జోరు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది.
మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందేమో వేచి చూడాలి.విపుల్ షా( Vipul shah ) నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో వేచి చూడాలి.







