టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన జనవరిలో రక్షిత రెడ్డి (Rakshita Reddy) అనే అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా శర్వానంద్, రక్షితల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే వీరి నిశ్చితార్థం(Engagement) జరిగి దాదాపు 5 నెలలు అవుతున్న ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ప్రకటన చేయకపోవడంతో వీరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

శర్వానంద్ రక్షిత పెళ్లి గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో వీరిద్దరు తమ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఇలా వీరి వివాహం రద్దు చేసుకున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో శర్వానంద్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా శర్వానంద్ టీం ఈ వార్తల గురించి స్పందిస్తూ శర్వానంద్ రక్షితల పెళ్లి ఆగిపోలేదని, ప్రస్తుతం వారిద్దరూ పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని శర్వానంద్ టీమ్ వెల్లడించారు.

ఇక పెళ్లి ఆలస్యం అవ్వడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య (Sriram Aaditya) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో శర్వానంద్ బిజీగా ఉన్నారని తెలిపారు.
ఇటీవల 40 రోజులపాటు లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చారని తెలియజేశారు.ఇక శర్వానంద్ ఒప్పుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత పెళ్లి గురించి అసలు విషయాలు ప్రకటించబోతున్నారని తెలియజేశారు.
ప్రస్తుతం శర్వానంద్ హైదరాబాద్ లోనే ఉన్నారని,ఇరువురు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి ముహూర్తం నిర్ణయించబోతున్నారని త్వరలోనే శర్వానంద్ రక్షితల వివాహ తేదీని కూడా అధికారకంగా ప్రకటించబోతున్నాం అంటూ శర్వానంద్ ఈ సందర్భంగా తన పెళ్లి గురించి వచ్చే వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు.







