ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్( KA Paul ).జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై మండిపడ్డారు.
ముఖ్యంగా అన్ని అనుకూలిస్తే టీడీపీ బీజేపీ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తానని పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల తానేమీ షాక్ కి గురికాలేదని చెప్పుకొచ్చారు.మొదటినుంచి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఎత్తుతూనే ఉన్నాడని తాను తెలియజేసినట్లు కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయి.ప్రత్యేక హోదా… ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు అదే విధంగా నాలుగు లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్… 4 వేల కోట్లకు అమ్మేస్తున్నారంటూ విమర్శలు చేశారు.“మనల్ని నాశనం చేసింది మోడీ, బీజేపీ.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ( BJP )…”బీ” పార్టీలు.

అందుకే అందరూ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతున్నారు.ఇంకా చేరనివారు, తెలివైనవారు ఎవరైనా ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.అనంతరం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.2008లో ప్రజారాజ్యం, 2011లో కాంగ్రెస్( Congress ) లో విలీనం.ఆ తర్వాత జనసేన ఏర్పాటు.2014లో టీడీపీ, బీజేపీలతో కూటమి.2019లో రామ్ పక్షాలు బిఎస్పీలతో జోడి మళ్లీ 2019 తర్వాత బీజేపీ, టీడీపీ తోనా ఇవి దశావతారాలు కావా…? నీకు స్థిరత్వం ఉందా.? చిరంజీవి ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి చేపట్టారు.నువ్వు ఎమ్మెల్యే కూడా కాకముందే పది పార్టీలు మారావు.అందుకే బీసీలు, కాపులు, దళితులు ఎవరు కూడా నమ్మటం లేదు.ఎన్టీఆర్ ని మోసం చేశాడని చంద్రబాబుని ఎవరు నమ్మటం లేదు.ఏపీలో చంద్రబాబు పార్టీ కూడా బీజేపీకి “బీ” పార్టీగా మారిపోయింది.
పవన్ ద్వారా చంద్రబాబు డ్రామాలాడిస్తున్నాడు అంటూ కేఏ పాల్… సీరియస్ కామెంట్స్ చేశారు.







