ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )భారత్ వేదికగా జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొడుతున్న ముగ్గురు ఆటగాళ్లను భారత జట్టులో చోటు కల్పించాలని రవిశాస్త్రి, హర్భజన్ సింగ్, కైఫ్ వంటి టీమిండియా దిగ్గజాలు అభిప్రాయపడుతున్నాయి.
కాబట్టి త్వరలో ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత జట్టుకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వారు ఎవరెవరో చూద్దాం.
తిలక్ వర్మ
: ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిలో పడ్డాడు.రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు తొందరగా పెవిలియన్ చేరిన సమయంలో ఈ తిలక్ వర్మ( Tilak Varma ) పరుగుల వరద పారించాడు.
మిడిల్ ఆర్డర్ లో ముంబై జట్టుకు తిలక్ వర్మ వెన్నెముకలాగా పనిచేస్తున్నాడు.ఈ సీజన్లో ముంబై జట్టు ఆడిన కొన్ని మ్యాచ్లలో కీలక పాత్ర పోషించి విజయం కూడా అందించాడు.
తిలక్ వర్మ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లలో ఒక అర్థ సెంచరీ చేసి 274 పరుగులు చేశాడు.ముంబై జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.లలో కూడా తిలక్ వర్మ రాణిస్తే భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రింకూ సింగ్:
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ తో రింకు సింగ్ ( Rinku Singh )ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి ఫేమస్ స్టార్ అయ్యాడు.క్రికెట్ అభిమానులు భారత జట్టుకు మరో ధోని దొరికాడని సంతోషపడుతున్నారు.ఆఖరి బంతికి బౌండరీలు మాది మ్యాచ్ను గెలిపించడంలో రింకు ది బెస్ట్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు.ఇతనికి కూడా భవిష్యత్తులో భారత జట్టులో చోటుదకే అవకాశాలు ఉన్నాయి.
యశస్వి జైస్వాల్:
రాజస్థాన్ ఓపెనర్ గా ఆడుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు.కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ లో అత్యంత వేగమైన ఆఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్ గా ఓ సరికొత్త చరిత్ర సృష్టించాడు.భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.