థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి రెండు ప్లాప్ సినిమాల తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ( Naga Chaitanya) లేటెస్ట్ గా నటించిన మూవీ ”కస్టడి’‘ ( Custody ).తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మరి రిలీజ్ అయిన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నిన్న ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూడాలి.
అయితే ముందు నుండి ఉన్న బజ్ కారణంగా మొదటి రోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ రాబట్టింది.

యూఎస్ లో అయితే డే 1 మంచి నంబర్స్ నమోదు చెయ్యగా.వరల్డ్ వైడ్ గా కస్టడీ డే 1 వసూళ్ల నంబర్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 7.4 కోట్ల గ్రాస్, 3.9 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా తెలుస్తుంది.మరి ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో ఏ రేంజ్ లో పుంజుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు.
చైతూ మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించాడు.నాగ చైతన్య కెరీర్ ఈ మధ్య కాలంలో బాగానే క్లిక్ అయ్యింది అని అనుకుంటుంటే మళ్ళీ వరుసగా రెండు సినిమాలు ప్లాప్ రావడంతో కొద్దిగా రేసులో వెనుక బడ్డాడు.
మరి ఈ సినిమా అయినా కలెక్షన్స్ పరంగా కమర్షియల్ హిట్ అవుతోందో లేదో చూడాలి.







