కర్ణాటక ఫలితాలు బీజేపీకి చెంపపెట్టని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు.ప్రజలలో విశ్వసనీయతను సంపాదించామన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత దేశ వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రతో జోష్ వచ్చిందని తెలిపారు.ప్రధాని మోదీ రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మలేదని చెప్పారు.
ఏపీ, తెలంగాణలోనూ కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తుందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.







