పత్తి పంటలో చీడపీడల నివారణకు వాడాల్సిన రసాయన పిచికారీ మందులు..!

పత్తి పంట( cotton crop )ను సాగు చేయాలంటే చీడపీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షక పద్ధతులు పాటించి పంటను సంరక్షించుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.పత్తికి ఏడాది పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉండడంతో తెల్లబంగారంగా చెప్పవచ్చు.

 Chemical Spray Drugs To Be Used To Prevent Pests In Cotton Crop..! , Cotton Crop-TeluguStop.com

రసాయన ఎరువుల( Chemical fertilizers ) విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ, తెగులు ఆశించిన మొక్కలను పంట నుంచి వేరుచేసి నాశనం చేసేయాలి.పంట పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.పంట వేసిన 30 రోజులకు ఎక్కువగా తెగుళ్లు, పలు రకాల పురుగులు పంటను ఆశించడం మొదలుపెడతాయి.40 నుంచి 45 రోజుల మధ్య రసం పీల్చే పురుగుల వ్యాప్తి అధికంగా ఉంటుంది.45 నుంచి 60 రోజుల మధ్య వివిధ రకాల పురుగులు పంటను ఆశిస్తాయి.

పత్తి పంటను చీడపీడల నుండి నివారించాలంటే పంట వేసినా 20 రోజులకు 100 మిల్లీలీటర్ల మిథైల్ డిమిటాన్( Methyl dimitan ) ను 400మి.లీ నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.తర్వాత పైరు 40 రోజుల కు చేరుకున్నాక ఇదే రసాయనాన్ని 500 మి.లీ నీటిలో 125 మి.లీ మందును కలిపి పిచికారి చేయాలి.తర్వాత పైరు 60 రోజులకు వచ్చినప్పుడు ఇదే రసాయన మందు 150 మి.లీ ను 600 మి.లీ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

మిథైల్ మటాస్ 25ఈసీ ను 200మి.లీ నీటిలో కలిపి పైరు 15, 25, 35 రోజులకు వచ్చినప్పుడు పంటకు పిచికారి చేయాలి.ఈ పిచ్చికారి మందులను క్రమం తప్పకుండా పత్తి పంటకు పిచికారి చేస్తే ఎటువంటి చీడపీడలు, తెగులు పంటను ఆశించకుండా సంరక్షించుకొని అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.

సరైన అవగాహన లేకపోతే దగ్గర్లో ఉండే వ్యవసాయ క్షేత్రం నిపుణుల సూచనలు పాటించి తక్కువ మోతాదులో రసాయన ఎరువులను వాడి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube