టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )ఒకరు.ఈయన ప్రస్తుతం హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తన ల్యాండ్ మార్క్ మూవీ ”సైంధవ్” సినిమాను చేస్తున్నాడు.
వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్( Niharika entertainments ) వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) నటిస్తుంది.
అసలు వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తుంది అని టాక్ వచ్చింది.
అసలు వీరి కాంబోలో సినిమా వస్తుంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా కూడా ఇంత వరకు ఈ కాంబో సెట్ అవ్వడం లేదు.
వంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు.ఇవి ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండి పోయే సినిమాలుగా నిలిచి పోయాయి.

అయితే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత వేరే సినిమాకు మాటలు రాయడం తగ్గించేశారు.ఇక త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఒక సినిమాను వెంకటేష్ తో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నప్పటికీ అది ఆచరణలో పెట్టడం లేదు.ఈయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో వెంకీ కోసం కథ రెడీ చేయడానికి త్రివిక్రమ్( Trivikram srinivas )కు సమయం సరిపోవడం లేదట.
ప్రెజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు.అందుకే వెంకీతో సినిమా ఎప్పుడో చెప్పడం కష్టమే.








