మలయాళ భామ మాళవిక మోహనన్( Malavika ) తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఇక్కడ ఆడియన్స్ ని తన వల్లో వేసుకుంది.దళపతి విజయ్( Vijay ) మాస్టర్ లో నటించిన అమ్మడు ఆ తర్వాత తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ తో మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తో తెలుగు తెరకు పరిచయమవుతుంది మాళవిక.ప్రభాస్ సినిమాతో ఎంట్రీ దొరకడం అమ్మడి అదృష్టమని చెప్పొచ్చు.
అంతేకాదు ప్రభాస్ ( Prabhas )హీరోయిన్ అనగానే అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయట.
ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా మాళవిక పేరుని రిఫర్ చేసినట్టు తెలుస్తుంది.
నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమా చేయాలని అనుకుంటుంది.మాళవిక మాస్టర్ స్కెచ్ లో మన స్టార్ హీరోలు చిక్కుకున్నారని చెప్పొచ్చు.
ప్రభాస్ సినిమా పూర్తి కాకుండానే మరో స్టార్ సినిమా త్వరలో ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది.దానితో పాటుగా ఇద్దరి పెద్ద హీరోల సినిమాల్లో మాళవిక పేరు వినపడుతుంది.
మొత్తానికి అమ్మడు భలే జాక్ పాట్ కొట్టేసిందని చెప్పుకుంటున్నారు.







