Custody Review: కస్టడీ రివ్యూ: మూవీ ఎలా ఉందంటే?

డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన సినిమా కస్టడీ.( Custody Movie ) ఇందులో అక్కినేని వారసుడు నాగచైతన్య( Naga Chaitanya ) కీలకపాత్రలో నటించాడు.

 Custody Review: కస్టడీ రివ్యూ: మూవీ ఎలా -TeluguStop.com

ఈయన సరసన కృతి శెట్టి( Krithi Shetty ) హీరోయిన్ గా నటించింది.వీటితోపాటు అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, రామ్ కీ, సంపత్ రాజ్, ప్రేమ్ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాకు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ఎస్ ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కోసం చూస్తున్న నాగచైతన్యకు కూడా ఈ సినిమా కలిసి వచ్చిందో లేదో చూడాలి.

కథ:

ఇందులో నాగచైతన్య శివ అనే పాత్రలో కనిపిస్తాడు.శివ నిజాయితీగల కానిస్టేబుల్.ఇక అతడు రేవతి (కృతి శెట్టి) ని ప్రేమించగా ఆమెను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు.అయితే అదే సమయంలో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో రాజన్న (అరవింద్ స్వామి) ని అరెస్టు చేస్తారు.ఇక ఆ సమయంలో డ్యూటీలో ఉన్న శివకు రాజన్నని చంపేస్తున్నారన్న విషయం తెలుస్తుంది.

ఇక అప్పుడే తను ప్రేమించిన రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది.ఇక ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు ఆరోజు రాత్రి రాజన్న తో పాటు రేవతిని కూడా తీసుకెళ్తాడు.

ఇక విషయం తెలియటంతో పోలీసులు వీళ్ళ కోసం గాలిస్తారు.అయితే రాజన్నను చంపాలనుకున్నది ఎవరు.

చివరికి రాజన్నను ఎలా కాపాడుతాడు.తను ప్రేమించిన రేవతిని దక్కించుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Aravind Swamy, Story, Review, Venkat Prabhu, Kriti Shetty, Naga Chaitanya

నటినటుల నటన:

మామూలుగా నాగచైతన్య మాస్ కంటే క్లాస్ లుక్ కు బాగా సెట్ అవుతాడు.ఇక ఈ సినిమాలో కూడా కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా నటించాడు.ఇందులో ఆయన పాత్ర చూస్తే బాగా కష్టపడినట్లు తెలుస్తుంది.ఇక కృతి శెట్టి గ్లామర్ పరంగా బాగా ఆకట్టుకుంది.అరవింద్ స్వామి( Aravind Swamy ) కూడా అద్భుతంగా నటించాడు.మిగిలిన నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.

Telugu Aravind Swamy, Story, Review, Venkat Prabhu, Kriti Shetty, Naga Chaitanya

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.కథ, కథనం బాగుంది.యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.మిగిలిన టెక్నికల్ విభాగాలలో అక్కడక్కడ కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

విశ్లేషణ:

ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించగా.అటు తమిళ ప్రేక్షకులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఉండేటట్లు చూపించాలి.

కానీ మధ్య మధ్యలో తమిళ్ నేటివిటీ ఎక్కువగా చూపించాడు.ఇక స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా.

అక్కడక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

Telugu Aravind Swamy, Story, Review, Venkat Prabhu, Kriti Shetty, Naga Chaitanya

ప్లస్ పాయింట్స్:

నాగచైతన్య పర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే లో మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.సెకండాఫ్ బోరింగ్ సీన్స్.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా సాగినట్లు అనిపించలేదు.ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపించగా సెకండ్ హాఫ్ కూడా అంతంత గానే అనిపించింది.ఈ సినిమాని ఒక్కసారి చూస్తే సరిపోతుంది.

రేటింగ్: 2.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube