తెలుగు దేశం పార్టీ( Telugudesam Party )ని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నారా లోకేష్( Nara Lokesh ) ( Yuvagalam ))యువగళం పేరుతో పాద యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే.గతంలో చంద్రబాబు నాయుడు( Chandra Babu Naidu) పాద యాత్ర చేసి అధికారాన్ని దక్కించుకున్నారు.
ఇప్పుడు తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ చేస్తున్న పాదయాత్ర కారణంగా అధికారంలోకి రావడం ఖాయం అంటూ తెలుగు తమ్ముళ్లు నమ్మకంతో ఉన్నారు.పాద యాత్ర జోరుగా సాగుతోంది.
మెల్ల మెల్లగా పలు మైలు రాళ్లను దాటవేస్తూ లోకేష్ పాదయాత్ర ( Padayatra )కొనసాగుతోంది.ఈ సమయంలో కొందరు సీనియర్ లు లోకేష్ పాదయాత్ర పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.లోకేష్ పాదయాత్ర సందర్భంగా సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదట.స్థానికంగా ఉన్న సీనియర్ లీడర్ ల యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా లోకేష్ స్థానిక సమస్యలపై మాట్లాడటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న యువ నాయకులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లడం వల్ల ఎన్నికల సమయంలో గ్రూప్ రాజకీయాలు అయ్యే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ నాయకులు ( Senior Politicians )మాత్రమే కాకుండా పార్టీకి చెందిన కొందరు కూడా యువగళం పాద యాత్ర లో స్థానికులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా లోకేష్ పక్కన ఉన్న వారికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ యువగళం పాద యాత్ర కొనసాగబోతున్న విషయం తెల్సిందే.ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క నాయకుడితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని.ముఖ్యంగా స్థానిక పార్టీ నాయకులను లోకేష్ టీమ్ ( Lokesh Team ))పట్టించుకోకుండా తమ పని తాము అన్నట్లుగా సాగితే ఆ నాయకులకు జనాల్లో బలం పెరిగేది ఎలా.ఆ నాయకుల గురించి లోకేష్ మాట్లాడకుంటే వచ్చే ఎన్నికల్లో జనాలు ఆ నాయకుడికి ఎలా ఓట్లు వేస్తారంటూ రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు.