మదర్స్ డే స్పెషల్.. అమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..

ఈ ఏడాది మే 14న మదర్స్ డేని( Mothers Day ) ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనున్నారు.ఇది తల్లుల పట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించాల్సిన రోజు.

 Best Electric Scooters To Gift Your Mom On Mothers Day Details, Electric Scooter-TeluguStop.com

ఈరోజు తల్లులు పడుతున్న శ్రమను గుర్తించి ప్రశంసలను తెలియజేయాల్సిన ప్రత్యేకమైన రోజు కూడా.అప్పుడప్పుడు బయటకు వెళ్లే, సౌకర్యవంతమైన రవాణా విధానం అవసరమయ్యే తల్లులకు ఈ స్పెషల్ డే సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను( Electric Scooter ) బహుమతిగా ఇవ్వడం ఒక మంచి నిర్ణయం అని చెప్పవచ్చు.

ఈ ఎకో-ఫ్రెండ్లీ, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్కూటర్లు ఆపరేట్ చేయడం సులభం.అలాగే ఇవి తక్కువ తర్వాత అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కూటర్లలో ఐదు తల్లులకు బెస్ట్ గా నిలుస్తున్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

1.

బౌన్స్ ఇన్ఫినిటీ E1:

ఈ స్కూటర్ స్వాపబుల్‌ బ్యాటరీ ప్యాక్‌, 65kmph టాప్ స్పీడ్, సింగిల్ ఛార్జ్‌పై 85 km రేంజ్ అందిస్తుంది.ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌ల వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.దీని ధర రూ.59,999.

Telugu Ampere Magnus, Bounce Infinity, Eco Friendly, Electric Photon, Mothers Da

2.హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX:

ఈ స్కూటర్ 550W BLDC మోటార్, 52.2V, 30Ah బ్యాటరీతో వస్తుంది.కావాలనుకునేవారు డబుల్ బ్యాటరీ వేరియంట్‌ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.

డబుల్ బ్యాటరీతో వచ్చే హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX( Hero Electric Optima CX ) 140 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.ఇది గరిష్ఠంగా గంటకు 45 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది.దీని ధర రూ.62,190.

Telugu Ampere Magnus, Bounce Infinity, Eco Friendly, Electric Photon, Mothers Da

3.ఆంపియర్ మాగ్నస్ EX:

ఇది స్కూటర్ LCD స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంతో ఫీచర్-రిచ్ స్కూటర్ గా నిలుస్తుంది.ఇది 1.2 kW మోటార్, 60V, 30Ah బ్యాటరీని ఆఫర్ చేస్తుంది.సింగిల్ ఛార్జ్‌పై 121 కి.మీ ప్రయాణించవచ్చు.పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-7 గంటలు పడుతుంది.దీని ధర రూ.73,999.

Telugu Ampere Magnus, Bounce Infinity, Eco Friendly, Electric Photon, Mothers Da

4.ఒడిస్సే రేసర్ లైట్ V2:

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌తో సింగిల్ ఛార్జ్‌పై 75 కి.మీ అందిస్తుంది.ఇందులో LED లైట్లు, స్టోరేజ్ కోసం పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది.

దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పడుతుంది.దీని ధర రూ.77,250.

Telugu Ampere Magnus, Bounce Infinity, Eco Friendly, Electric Photon, Mothers Da

5.హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్:

ఇది 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్, 1200W మోటారును కలిగి ఉంది.ఫుల్ ఛార్జ్‌పై 90 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.ఇది గరిష్టంగా 45 km/hr వేగంతో దూసుకెళ్తుంది.దీని ధర రూ.80,790.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube