పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఆదిపురుష్”.( Adipurush ) ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అందుకే మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని ఎంత వీలైతే అంత ఎక్కువుగా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
భారీ మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటిస్తున్నారు.

మరి ఈ భారీ సినిమా నుండి ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్( Om Raut ) ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఫ్యాన్స్ చేసేలా చేసాడు.ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా మార్చేశాడు.టీజర్ తో నిరాశ పరిచిన డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్ తో సినిమాలో చాలా ఉంది అనేలా చేసాడు.

ఇక ముందు ముందు కూడా ఇదే రేంజ్ లో ప్రమోషన్స్ ఉండబోతున్నాయట.తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవల్లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.జూన్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి గ్రాండ్ గా చేయనున్నారట.ఇక ఆ తర్వాత దేశంలో ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించ నున్నట్టు తెలుస్తుంది.
మరి జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి.







