పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) .ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమం లో ఈ కాంబో పై అంచనాలు భారీగా పెరిగాయి.
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కిన తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం మళ్ళీ ఇప్పుడే.
అందుకే ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నుండి తాజాగా గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఉస్తాద్ గ్లిమ్స్ (Ustaad Bhagat Singh First Glimpse) కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ గ్లిమ్స్ ను అయితే నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు.ఈ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.
పవన్ మరోసారి పోలీస్ గెటప్ లో అదరగొట్టాడు.ఈసారి అంతకు మించి ఉంటుందని టీజర్ తోనే తెలిపారు.

మరి ఈ టీజర్ గ్లిమ్స్ కు 10 గంటల్లోనే 9.3 మిలియన్ మార్క్ ను టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండ గా.దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.







