విశాఖ పర్యటనలో యుద్ధ విమానాల మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్( CM Jagan ) గురువారం సాయంత్రం విశాఖపట్నం పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్డులో వీఎంఆర్డిఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియార్ యుద్ధ విమానం మ్యూజియం.

 Cm Jagan Inaugurated The Sea Harrier Museum During His Visit To Visakha Details,-TeluguStop.com

( Sea Harrier ) సీఎం జగన్ ప్రారంభించడం జరిగింది.అంతకుముందు ఆరిలోవలోని అపోలో హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించారు.

ఆ తర్వాత అక్కడ సిబ్బందితో కాసేపు మాట్లాడి.గ్రూప్ ఫోటో దిగటం జరిగింది.

క్యాన్సర్ యూనిట్ లో రేడియేషన్ ఎక్విప్మెంట్ ను పరిశీలించారు.

అంతకముందు వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 సీఎం జగన్ ప్రారంభించడం జరిగింది.ఈ క్రమంలో రంజి ప్లేయర్స్ తో ముచ్చటించారు.వైఎస్ఆర్ స్టేడియంలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన సీఎం జగన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగటం జరిగింది.

ఇక ఇదే స్టేడియంలో దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న సీఎం జగన్ ని నగర మేయర్ హరి వెంకట కుమారితో పాటు మంత్రి అమర్నాథ్… ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube