మినుము పంటలో పల్లాకు తెగుళ్ళ నివారణకు సస్యరక్షణ చర్యలు..!

మినుము( Vigna mungo, ) పంటను వర్షాధారంగా, రబీ సీజన్లో సాగు చేస్తారు.మినుము పంటకు అన్ని రకాల నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి.

 Vigna Mungo Protection Measures For The Prevention Of Pallaku Pests In Vigna Mun-TeluguStop.com

వరి మాగాణి లో అయితే డిసెంబర్ నెలలో విత్తుకోవాలి.వర్షాధార పంట గా అయితే జూన్ లేదా జులై నెలలో విత్తుకోవాలి.

మినుము పంటకు నీటి అవసరం చాలా తక్కువ కాబట్టి వర్షపు నీటితోనే మినుమును పండించవచ్చు.

మినుము పంట వేసే పొలంలో ముందుగా వేసవి లో లోతు దుక్కులు దున్నాలి.

తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో భూమిని మెత్తగా చేసుకోవాలి.తేమ నిల్వ ఉండే భూములలో అధిక దిగుబడి సాధించవచ్చు.

ఈ పంటకు పెట్టుబడి చాలా తక్కువ అవసరం.

Telugu Agriculture, Formers, Latest Telugu, Vigna Mungo-Latest News - Telugu

వర్షాధారంగా పండిస్తే ఎకరాకు 6 కిలోల విత్తనాలు అవసరం.అదే వరి మాగాణి లో అయితే 10 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను పొలంలో నాటే ముందు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

లేదంటే చీడపీడల బెడద అధికంగా వ్యాపించి తీవ్ర నష్టం వస్తుంది
.

Telugu Agriculture, Formers, Latest Telugu, Vigna Mungo-Latest News - Telugu

మినుము పంటకు పల్లాకు తెగుల బెడద చాలా ఎక్కువ.సకాలంలో ఈ తెగులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే పంట మొత్తం నాశనం అయ్యి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.కాబట్టి పల్లాకు తెగులను ఎలా గుర్తించాలో.

ఎలా నివారించాలో తెలుసుకుందాం.

ఈ పల్లాకు తెగులు జెమిని వైరస్ జాతి వల్ల వ్యాప్తి చెందుతాయి.

లేత ఆకులపై, కాయలపై పసుపు పచ్చ మచ్చలు ఏర్పడితే వాటిని పల్లాకు తెగులుగా నిర్ధారించుకోవాలి.తొలి దశలో ఈ తెగులు సోకిన వెంటనే పైరు గిడస బారిపోయి, పూత ఎండిపోతుంది.

అంతేకాకుండా ఈ వైరస్( Virus ) సోకిన ప్రాంతంలో తెల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఈ తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి.ఒక లీటర్ నీటిలో 1.6మి.లీ మోనోక్రోటోఫాస్ ను కలిపి మొక్క మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube