అమెరికా : గ్రీన్‌కార్డ్‌పై కంట్రీ కోటా‌కు ఇక చెక్ .. కొత్త పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టిన డెమొక్రాట్లు

అమెరికా( America ) కల నెరవేర్చుకునే ప్రస్థానంలో చివరి మజిలీ గ్రీన్ కార్డు.హెచ్ 1 బీ సహా ఇతర వీసాల సాయంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు గ్రీన్ కార్డు వస్తే ఇక జీవితంలో ఎలాంటి చీకూ చింతా వుండదు.

అయితే అది అనుకున్నంత తేలిక కాదు.ఎందుకంటే అమెరికాకు వచ్చే వలసల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.

దీంతో గ్రీన్ కార్డుల కేటాయింపు ఆ దేశ ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది.ఇతర దేశాల సంగతి పక్కనబెడితే.

గ్రీన్ కార్డుల( Green Card ) కోసం ఎక్కువగా పడిగాపులు కాస్తోంది భారతీయులే.తీవ్రమైన పోటీ నేపథ్యంలో గ్రీన్‌కార్డులపై కోటా తీసుకొచ్చింది అగ్రరాజ్యం.

దీని ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తూ వస్తోంది అమెరికా.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.

భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్‌కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.దీంతో ఎంతోమంది భారతీయులు బ్యాక్‌లాగ్‌లో వుండిపోతున్నారు.

Telugu America, China, Citizenship, Congresswoman, Democratic, Green, Linda Sanc

ఈ నేపథ్యంలో అధికార డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు యూఎస్ కాంగ్రెస్‌లో బుధవారం పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు.గ్రీన్‌కార్డ్‌ల జారీ విషయంలో కంట్రీ క్యాప్ విధానాన్ని తొలగించడంతో పాటు హెచ్ 1 బీ వీసా వ్యవస్థలో మార్పులు చేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.కాంగ్రెస్ సభ్యురాలు లిండా సాంచెజ్ ప్రవేశపెట్టిన యూఎస్ పౌరసత్వ చట్టం 2023 ప్రకారం.ఎలాంటి పత్రాలు లేని మొత్తం 11 మిలియన్ల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు కావాల్సిన రూట్ మ్యాప్‌ను రూపొందించింది.

డ్రీమర్‌లు, టీపీఎస్ హోల్డర్లు, కొందరు వ్యవసాయ కార్మికుల పౌరసత్వానికి ఇది తక్షణం దారి చూపుతుంది.

Telugu America, China, Citizenship, Congresswoman, Democratic, Green, Linda Sanc

అలాగే ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ( Immigration system )లో మార్పులు చేయాలని ఈ చట్టం ప్రతిపాదిస్తోంది.అమెరికా విశ్వవిద్యాలయాల్లో STEM అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్టర్లు వుండటాన్ని సులభతరం చేయడం, తక్కువ వేతన పరిశ్రమలలోని కార్మికులకు గ్రీన్‌కార్డ్ పొందే సౌకర్యాన్ని మెరుగుపరచడం, హెచ్1బీ( H-1B ) వీసాదారులపై ఆధారపడ్డ వారు పనిచేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పించనుంది.అమెరికన్ కార్మికుల అన్యాయమైన పోటీ నుంచి రక్షించడానికి .వలసేతర, అధిక నైపుణ్యం వున్న వీసాదారులకు అధిక వేతనాలు ఇచ్చేలా ఈ చట్టం ప్రోత్సహిస్తుంది.అటు LGBTQ+ కుటుంబాలు ఎదుర్కొంటున్న వివక్షను కూడా ఈ చట్టం తొలగిస్తుంది.

అనాథలు, వితంతువులు , పిల్లలకు రక్షణను అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube