తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి( Maruthi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించినటువంటి ఈయన తాజాగా తన భార్య స్పందన(Spandana)తో కలిసి వెన్నెల కిషోర్( Vennela Kishore ) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరే ప్రేమ పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.స్కూల్ సమయంలోనే వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమని మారుతి తన సీనియర్ అంటూ స్పందన తెలిపారు.

స్కూల్లోనే మొదలైన మా ప్రేమ ఇలా పెళ్లి బంధం వరకు ప్రయాణం చేసిందని తెలియజేశారు.ఇక మొదట ఎవరు ప్రపోజ్ చేశారని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు మారుతి సమాధానం చెబుతూ ప్రపోజ్ చేయడానికి లేవు కేవలం ఇష్టం అని మాత్రమే చెప్పాను.ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళగా స్పందన వాళ్లు విజయవాడ వెళ్లిపోయారని మారుతి తెలిపారు.ఇక స్పందనకు ఓ అలవాటు ఉంది తాను ఏ చిన్న పని చేసిన డైరీలో రాసే అలవాటు ఉందని తెలిపారు.

ఇక మేమిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఫోన్ కాల్స్ మాట్లాడటం కలుసుకోవడం వంటివి చేసేవారు కానీ స్పందన మాత్రం తాను ఏ సమయానికి నన్ను ఎక్కడ కలిసింది ఎప్పుడు ఫోన్ చేసింది అనే విషయాలన్నీ క్లుప్తంగా డైరీ( Dairy )లో రాసి పెట్టేది.పేరెంట్స్ కి తెలియకుండా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికి డైరీ వల్ల దొరికిపోయామని మారుతి తెలిపారు.స్పందన రాసిన డైరీ తన ఇంట్లో వాళ్ళు చూసి స్పందన వాళ్ళ అమ్మ తనకు ఫోన్ చేశారని మారుతి తెలిపారు.అలా డిగ్రీ పూర్తయిన తర్వాత స్పందనతో నా పెళ్లి జరిగిందని ఈ సందర్భంగా మారుతి తన పెళ్లి గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






