Prabhas : తగ్గని డార్లింగ్ క్రేజ్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ అతనే?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Another Director Ready For The Prabhas-TeluguStop.com

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాతో పాటు సలార్( Salaar ),ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Telugu Salaar, Adipurush, Prabhas, Project, Spirit, Tollywood-Movie

ఈ సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి మరొకటి భారీ బడ్జెట్ రూపొందుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలు ఇంకా పట్టాలెక్కకు ముందే ప్రభాస్ కథలో మరో సినిమా వచ్చి చేరింది.తాజాగా దర్శకుడు హను రాఘవపూడి( Director Hanu Raghavapudi ) ఒక అందమైన ప్రేమ కథను ప్రభాస్ కోసం తయారు చేశారట.ఈ మేరకు ఆ కథను ప్రభాస్ కు వినిపించడం కోసం ప్రభాస్ ని సంప్రదించారట.

అయితే ఆ ప్రాజెక్టుకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.అయితే ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు.

ఈలోపు హను రాఘవపూడి ఇప్పుడు మరో హీరోతో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Telugu Salaar, Adipurush, Prabhas, Project, Spirit, Tollywood-Movie

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా( Adipurush ) విషయానికి వస్తే.గత ఏడాది విడుదలైన టీజర్ భారీగా ట్రోల్స్ ని నెగటివ్ కామెంట్స్ ని విమర్శలను ఎదుర్కోవడంతో చిత్రబంధం ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్లను చేసి మరోసారి విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకులు నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంజనాలు కూడా నెలకొన్నాయి.ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube