వైరల్: మొదటిసారి తండ్రిని చూసిన బేబీ గొరిల్లా ఉద్వేగం చూడండి... ఎంత చూడముచ్చటగా వుందో!

తల్లి, బిడ్డల అనుబంధం అనేది వర్ణించడానికి వీలుకానిది.తల్లి తన బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని అంటారు.

 Baby Gorilla Meets The Father For The First Time Video Viral Details, Baby Goril-TeluguStop.com

అవును, ఈ ప్రపంచంలో ఏ జీవి తల్లి అయినా పిల్లల ఆలనా, పాలనా, లాలన అన్నీ దగ్గరుండి మరీ చూస్తుంది.అయితే తండ్రి, బిడ్డల బంధం అనేది చాలా విచిత్రమైనది.

గుండెనిండా ప్రేమ ఉన్నా.ఎలా చూపాలో తెలియని అమాయకత్వం తండ్రికుంటుంది.

ఇక్కడ ప్రతీ తండ్రి తన పిల్లల ప్రతి కదలికను చూసి ఆనందిస్తాడు.తన అవసరాలను పక్కనబెట్టి.

తన పిల్లల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటాడు నాన్న.

తండ్రి ( Father ) తొలిసారి తన బిడ్డను తాకినప్పుడు, బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు.తాజాగా ఇలాంటి సంతోషకరమైన, ఉద్వేగభరితమైన విషయం నెట్టింట దృశ్య రూపంలో సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది.అవును, ఓ బేబీ గొరిల్లా( Baby Gorilla ) తొలిసారి తన తండ్రిని కలుసుకుంది.

ఆ క్షణంలో బేబీ గొరిల్లా, తండ్రి గొరిల్లా( Father Gorilla ) ప్రవర్తన చూసేందుకు మన రెండు కళ్లు చాలవంటే నమ్మండి.ఈ ఉద్వేగభరితమైన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోని గమనిస్తే, పిల్ల గొరిల్లా త‌న తండ్రి ముఖాన్ని మెల్లగా త‌డుముతూ ఉండడం చూడవచ్చు.ఆ రెండు గొరిల్లాల కదలికలు చూస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తున్నాయి.ఈ వీడియో ఇప్పటివ‌ర‌కూ 94,000 మందికి పైగా వీక్షించడం విశేషం.ఇక కామెంట్స్ సెక్షన్ అయితే పూర్తిగా హార్ట్‌, ల‌వ్ ఎమోజీల‌తో నిండిపోయింది.ఈ క్రమలో ఓ యూజర్ “న్యూరోస‌ర్జన్ భార్యగా నా పిల్లలు తమ తండ్రితో గడిపే క్షణాలు నాకు తెలుసు.ఇది కూడా అలాగే ఉంది” కామెంట్ చేశారు.

మరెందుకు ఆలస్యం.మీరు కూడా ఈ వీడియోను చూసి తరించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube