అప్పుడప్పుడు జనాలు తమకు నచ్చిన అభిమాన హీరో హీరోయిన్లకు సలహాలు ఇస్తూ ఉంటారు.అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు.
వారిలో ఏదైనా మార్పు వస్తే కూడా అస్సలు తట్టుకోలేక పోతారు.ఇప్పటికీ అలా సలహాలు ఇచ్చిన నటుల అభిమానులు చాలామంది ఉన్నారు.
అయితే తాజాగా మెహరీన్ కు కూడా తన అభిమానులు సలహాలు ఇస్తున్నట్లు కనిపించారు.అది ఏ విషయంలోనో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మెహరీన్ కౌర్ ( Mehreen Pirzada )గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పంజాబీ కి చెందిన ఈ బ్యూటీ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.అలా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించింది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఇక మెహరీన్ తొలిసారిగా నాచురల్ స్టార్ హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ( krishna Gaadi Veera Prema Gaadha ) గాధ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాలో తన నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇక కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా.అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి.
అలా అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది మెహరీన్.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉందని తెలుస్తుంది.ఈ బ్యూటీ సోషల్ మీడియా( Social media )లో బాగా ఎనర్జీగా కనిపించడంతో.
నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన సినిమాల అప్డేట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేస్తుంది.అప్పుడప్పుడు తను చేసే విన్యాసాల వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.

తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తుంది.తనకు షూటింగులు లేకుండా ఉంటే చాలు ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతుంది.ఇటీవలే తన ఫ్యామిలీ అందరితో కలిసి కొన్ని విదేశాలలో తిరిగింది.అయితే ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో చాలా క్యూట్ గా బొద్దుగా కనిపించగా ఇప్పుడు బాగా సన్నబడింది.
దీంతో సన్నగా మారినప్పటి నుంచి ఆమె ఫేస్ లో లుక్ మొత్తం పోయింది.అయితే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో బ్లాక్ కలర్ చీర కట్టుకొని ఉండగా చాలా సన్నగా కనిపించింది.తన ఫేస్ కూడా చాలా పేలా గా అనిపించింది.
దీంతో ఆ ఫోటోలు చూసి తన అభిమానులు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో ఎలా ఉన్నావో అలా అవ్వు.అప్పట్లో చాలా క్యూట్ గా ఉన్నావు అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక మరి కొంతమంది కాస్త బాగా తినండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







