హాలీవుడ్‌ రైటర్స్‌ని వెంటాడుతోన్న ఏఐ ఫోబియా... కారణాలు ఇవే!

ఇపుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా చాట్‌జిపిటి గురించే చర్చ.అవును, ఏఐ జనరేటివ్‌ టూల్స్‌ రాకతో చాలా రంగాల్లో ఇపుడు ఓ రకమైన ఆందోళన మొదలైంది.

 Hollywood Writers Striking Fear Ai Will Write Them Out Of The Script Details, Ho-TeluguStop.com

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( Artificial Intelligence ) వలన చాలా మంది ఉద్యోగాలు పోతాయని, జాబ్‌ మార్కెట్‌పై అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో తాజాగా ఇదే అంశానికి సంబంధించి హాలీవుడ్‌ రైటర్స్‌( Hollywood Writers ) స్టైక్‌ చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

Telugu Ai Script, Chatgpt, Literacy, Ups, Writersguild-Telugu NRI

అవును, తమకు పే చేస్తున్న మనీకి సంబంధించిన స్టైక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.వారి బాధ ఏమిటంటే భవిష్యత్తులో రైటర్స్‌ను ఏఐ భర్తీ చేయవచ్చని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏఐ ప్రోగ్రామ్‌లు అనేవి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతటా ఇలాంటి ఆందోళనలు చెలరేగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా( Writers Guild of America ) ఒక బైండింగ్ అగ్రిమెంట్‌ను ప్రతిపాదించింది.

Telugu Ai Script, Chatgpt, Literacy, Ups, Writersguild-Telugu NRI

ఇందులో ఏఐ రాసిన ఏదైనా ‘లిటెరసీ’ లేదా ‘సోర్స్‌’ మెటీరియల్‌గా పరిగణించకూడదు, WGA సభ్యులు రాసిన స్క్రిప్ట్‌లను ఏఐకి ట్రైనింగ్‌ ఇవ్వడానికి అనుమతించకూడదు అని పేర్కోవడం విశేషం.కాగా స్టూడియోలు ఈ ప్రతిపాదనను తిరస్కరించడం కొసమెరుపు.బదులుగా టెక్నోలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌ గురించి చర్చించడానికి సంవత్సరానికి ఒకసారి సమావేశం కావాలని ప్రతిపాదించాయి.ఇకపోతే కొంతమంది హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్‌లు రాబోయే కొద్ది సంవత్సరాలలో ఏఐ మంచి సినిమాలను స్క్రిప్ట్‌ రాయగలదని నమ్ముతున్నారు.

అందుకే తమ తదుపరి హిట్ షోలను రాయడానికి, డబ్బును ఆదా చేసుకోవడానికి కంప్యూటర్‌లపై ఆధారపడే అవకాశం ఉందని రైటర్‌లు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube