ఒకే నగరంలో రెండు దేశాలు ఉండడమేమిటి అని అనుకుంటున్నారా? ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ పూర్తి కధనం చదవాల్సిందే.అవును, మీరు విన్నది నిజమే.
ఇక్కడి ప్రజలు వంట నెదర్లాండ్స్‌లో( Netherlands ) వండితే, భోజనం బెల్జియంలో( Belgium ) చేస్తారు.వారి ఖాతాలు కూడా బెల్జియంలోనే ఉంటాయి మరి.ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషమేమిటంటే… రెండు దేశాలకు చెందిన ఇళ్లు ఇక్కడ చాలానే ఉంటాయి.వారు బెల్జియం, నెదర్లాండ్స్ రెండు దేశాల్లోనూ పన్నులు చెల్లిస్తుంటారు.

దానికి సరిహద్దు రేఖ ఉండడమే ప్రధాన కారణం.ఆ ప్రధాన రేఖ అనేది రోడ్లు, గార్డెన్స్, మ్యూజియంలు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా ఇళ్ల మధ్య నుండి వెళుతుంది.అంటే, ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ఏమంటే, చాలా ఇల్లు సగం బెల్జియంలో ఉంటే మరోసగం నెదర్లాండ్స్‌లో ఉంటాయి.ఇంతకీ ఆ నగరం పేరు మీకు చెప్పలేదు కదూ.ఆ నగరం పేరు బార్లే.ఇది బెల్జియం నెదర్లాండ్స్ సరిహద్దులో ఉంటుంది.
ఇది రెండు భాగాలుగా విభజింపబడి ఉండడం వలన ప్రధాన ఆకర్షణగా మారింది.

బెల్జియంలో నిర్మించిన ఈ నగరం శతాబ్దాలుగా ఇలాగే ఉండడం గమనార్హం.1198లో, భూమిని అనేక భాగాలుగా విభజించడానికి ఇద్దరు రాజుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది.ఈ క్రమంలో వీటిలో రెండు దేశాలలో ఉన్న బార్లే నగరం( Barle city ) రెండుభాగాలుగా విభజింపబడింది.
ఇక ఇక్కడ ఏ ఇంటి ప్రధాన ద్వారం ఏ దేశంలో ఉంటుందో ఆ ఇల్లు ఆ దేశానికి చెందినదిగా పరిగణించబడుతుంది.అయితే ఇంట్లో ఏదైనా భాగం వేరే దేశంలో ఉంటే ఆ దేశంలో కూడా ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బార్లీ నగరంలో ఏదైనా పని జరగాలంటే ఇరుదేశాల మేయర్లు పరస్పరం మాట్లాడుకోవాలి.పోలీసులు కూడా సామరస్యంగా నడుచుకుంటున్నారు.







