ఈ రోజుల్లో విద్యార్థులు టీచర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు.వారు టీచర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ షాకిస్తున్నారు.
తాజాగా ఒక విద్యార్థిని తన టీచర్‌పై ఏకంగా పెప్పర్స్ కొట్టి ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.ఇటీవల అమెరికా( America ) దేశం, టేనస్సీ రాష్ట్రంలోని ఆంటియోచ్ హైస్కూల్‌లో( Antioch High School ) ఒక విద్యార్థిని క్లాస్ సమయంలో ఫోన్‌ను ఉపయోగించగా దానిని టీచర్ లాక్కున్నాడు.
అయితే ఫోన్ లాక్కోవడంతో సదరు ఫిమేల్ స్టూడెంట్ టీచర్‌పై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది.ఈ ఘటనను మరో విద్యార్థి కెమెరాలో బంధించి ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు.ఈ వీడియోలో ఫిమేల్ స్టూడెంట్ స్కూల్ హాలులో ఒక ఉపాధ్యాయుడిని అనుసరిస్తుండగా, అతడు ఆమెను ఫేస్ చేయలేక తరగతి గది నుంచి బయటకు పరుగెత్తడం కనిపించింది.తర్వాత ఆమె తనపై పెప్పర్ స్ప్రే చేసిందని సదరు టీచర్ గగ్గోలు పెట్టాడు.
అయితే విద్యార్థిని ఏమాత్రం జాలి చెప్పకుండా తన ఫోన్‌ను తిరిగి చేయాలంటూ డిమాండ్ చేసింది.టీచర్ ఆమెకు ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆమె అతనిపై మళ్లీ స్ప్రే కొట్టింది.దీంతో అతను నొప్పితో నేలపై పడిపోయాడు.ఉపాధ్యాయుడు బాధతో అరుస్తున్నప్పుడు తరగతిలోని ఇతర విద్యార్థులు నవ్వడం, జోక్ చేయడం వినపడింది.స్కూల్ వర్క్‌కి సంబంధించిన సమాధానాలు, గూగ్లింగ్‌లో మెసేజ్‌లు పంపుతున్నందున విద్యార్థి ఫోన్‌ను టీచర్ స్వాధీనం చేసుకున్నాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.