నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోళ్ళలో జరుగుతున్న అలసత్వాన్ని నిరసిస్తూనల్లగొండ జిల్లా( Nalgonda District ) దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వందలాది మంది అన్నదాతలు ఒక్కసారిగా ఆందోళనకుదిగి,సుమారు గంటన్నరపాటు ధర్నా నిర్వహించారు.దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
అసలే వేసవి కాలం కావడంతో ప్రయాణికులు తీవ్రత ఇబ్బందులకు గురయ్యారు.అనంతరం పలువురు రైతులు మాట్లడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం( cm kcr ) పూర్తిగావిఫలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనా స్థలానికి గుడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో చేరుకొని రైతులకు నచ్చజెప్పి,సంబంధిత అధికారులతో మాట్లాడి, సకాలంలో కొనుగోళ్ళ ప్రక్రియను వేగవంతం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించా