మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ క్రమంలో న్యాయమూర్తి వైఎస్ వివేకా హత్య కేసు సీడీ ఫైల్ అడిగారు.
అయితే సదరు సీడీ ఫైల్ ఢిల్లీలో ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
కాగా హత్య కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.







